Tuesday 21 March 2017

ఏదైనా ఆపరేషన్ చేయాలా ? మాకు ఫోన్ చేయండి అంతా ఉచితమే

ఏదైనా ఆపరేషన్ చేయాలా ? మాకు ఫోన్ చేయండి అంతా ఉచితమే

ఏదైనా ఆపరేషన్ చేయాలా ? మాకు ఫోన్ చేయండి అంతా ఉచితమే
ఏదైనా ఆపరేషన్ చేయాలా ? మాకు ఫోన్ చేయండి అంతా ఉచితమే
గుండె ఆపరేషన్‌ చేయాలని వైద్యుడు చెబితే.. మననుంచి వచ్చే మొదటి ప్రశ్న ఎంత అవుతుందనే కదూ!ఆ తరవాతే బీమా సౌకర్యం, ఎన్నిరోజుల్లో ఇంటికొస్తాం వంటివి అడుగుతాం. అయినా మరో ఇద్దరు వైద్యుల్ని సంప్రదించాకే ఓ నిర్ణయం తీసుకుంటాం.. వీటన్నింటికీ సమయమే కాదు, ఎంతో కొంత డబ్బూ వృథా అవుతుంది. దాన్ని గుర్తించిన రావూరి నివేదిత భర్తతో కలిసి ‘కేర్‌ మోటో’ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది.. ఉచితంగా.. రోగుల సందేహాల్ని తీర్చడం, అత్యుత్తమమైన వైద్య సేవల వివరాలు అందించడం, అవసరమైన శస్త్రచికిత్సల్ని వీలైనంత తక్కువ ఖర్చులో అందించడమే వీరి పని..
వైద్యులుగా రోగుల కష్టాలూ, ఆర్థికంగా ఎదుర్కొనే ఇబ్బందుల్ని కళ్లారా చూశాం.. ఆ తరవాతే ‘కేర్‌ మోటో’ సేవల్ని ప్రారంభించాం. నేను చిన్న పిల్లల వైద్య నిపుణురాలిని అయితే.. మా వారు గ్యాస్ట్రో సర్జన్‌. మాది ఖమ్మం జిల్లాలోని చిన గోపతి అనే పల్లెటూరు. ఇద్దరం కొన్నాళ్లు చెన్నైలో పనిచేసి మూడేళ్ల క్రితమే హైదరాబాద్‌ వచ్చాం. ఇక్కడా వేర్వేరు ఆస్పత్రుల్లో పనిచేస్తునే ‘కేర్‌మోటో’ను స్థాపించాం. సాధారణంగా ఆస్పత్రులకు వచ్చే రోగుల ఇబ్బందులు చూశాకే ఆ నిర్ణయం తీసుకున్నాం. కొందరికి ఏదయినా శస్త్రచికిత్స చేయించుకోమని చెబితే.. నిజంగా అవసరమా అని సందేహిస్తారు. ఇద్దరు ముగ్గురు వైద్యుల్ని సంప్రదించి వాళ్ల అభిప్రాయం తీసుకున్నాకే ఎక్కడో ఒక చోట చేయించుకోవడానికి సిద్ధమవుతారు. దీన్నే వైద్య పరిభాషలో ట్రీట్‌మెంట షాపింగ్‌ అంటారు. కానీ ఇందుకోసం వాళ్లు పనులు మానుకోవాలి.. అవసరమైతే ఛార్జీలు పెట్టుకొని మరీ ­ఊరు కాని ­ఊరు రావాల్సి ఉంటుంది.. అలానే శస్త్రచికిత్స చేయించుకునేందుకు ఆసుపత్రి వారితో మాట్లాడితే.. ఇంత అవ్వొచ్చు అని ఉజ్జాయింపుగా చెబుతారు తప్ప కచ్చితంగా చెప్పరు. దాంతో రోగులు ఆ మొత్తాన్నే సిద్ధం చేసుకుంటారు. ఒకవేళ ఆ ఖర్చు చికిత్స పూర్తయ్యేసరికి పెరిగితే వాళ్లకు ఇబ్బందే. తీరా ఆసుపత్రిలో చేరాక సౌకర్యాలు లేవని తెలిస్తే కొత్త సమస్యలు. ఇలాంటివన్నీ ప్రత్యక్షంగా గమనించాకే నాకూ, మావారికీ ఈ ఆలోచన వచ్చింది.
3 వేల మందితో మాట్లాడాం..
రోగుల సమస్యల్ని వాళ్ల మాటల్లోనే తెలుసుకుంటే మరింత సమాచారం తెలుస్తుందనే ఉద్దేశంతో మా దగ్గరకు వచ్చే వారితో మాట్లాడేవాళ్లం. అలా వందల్లో కాదు.. దాదాపు మూడువేల మందితో మాట్లాడి వాళ్ల సమస్యల్ని తెలుసుకున్నాం. అలాగే బీమా సౌకర్యం ఏ అసుపత్రిలో ఉందో తెలియక చాలామంది చికిత్సలు మానేస్తున్నట్టూ తెలిసింది. ఏది మంచి ఆసుపత్రీ, ఎక్కడ వైద్యసేవలు బాగుంటాయి వంటి సమాచారం కోసం రోగులూ చూస్తున్నారని అర్థమైంది. పేదలయితే ఆరోగ్య శ్రీ ఎలాంటి సమస్యలకి వర్తిస్తుంది, దేనికి వర్తించదు అనేది తెలుసుకునేందుకు ప్రాధాన్యమిస్తారు. అయితే చాలామంది చికిత్సలను వాయిదా వేసి సమస్యను ఇంకా పెంచకోవడమూ గమనించాం. ఇలాంటివాటన్నింటిపై ఓ అంచనాకు వచ్చాకే గతేడాది మా సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. ముందుగా ‘మీకు ఏవైనా శస్త్రచికిత్సలకు సంబంధించిన సమాచారం కావాలంటే మమ్మల్ని సంప్రదించండి’ అంటూ ఓ ఫోను నెంబరు ఇచ్చి యాభై వేల కరపత్రాలను ముద్రించాం. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో వాటిని పంచాం. ఆ రోజు చాలా ఫోన్లు వచ్చాయి. కొందరు ‘మాకు నిర్ణీత ధరలో చికిత్స చేసే ఆసుపత్రి ఉంటే చెప్పండి’ అని అడిగారు. మరికొందరు ఫలానా చికిత్స ఏ ఆసుపత్రిలో బాగా చేస్తారు అనీ, సౌకర్యాలు ఎక్కడ బాగుంటాయి, బీమా సేవలూ.. ఇలా ఎన్నో అడిగారు. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులకి ఆ నెంబరు ఇచ్చి ఫోన్లు చేయించినవారూ ఉన్నారు.
హెల్ప్‌లైను ఏర్పాటు...
అవన్నీ చూశాక మా సేవలు సామాన్యులకు తప్పకుండా ఉపయోగపడతాయని అనిపించింది. అందుకే రోగుల కోసం ప్రత్యేకంగా ఒక హెల్ప్‌లైను నెంబరును అందుబాటులోకి తెచ్చాం. ఉదయం పది నుంచీ సాయంత్రం ఐదు గంటల వరకూ నిపుణులు అందుబాటులో ఉంటారు. చేయించుకోవాల్సిన చికిత్సలూ, ఆసుపత్రులూ, సదుపాయాలకు సంబంధించి ఏ సందేహం ఉన్నా మా నిపుణులు తీరుస్తారు. వైద్యరంగంలో పదేళ్ల అనుభవం ఉన్నవారే మా నిపుణుల బృందంలో ఉంటారు. అలాంటివాళ్లను ఏర్పాటు చేయడంతోపాటూ మేం చేసిన మరో పని.. నిర్ణీత ధరలో చికిత్స చేసేలా ఆసుపత్రులతో మాట్లాడటం. అంటే.. ఒక శస్త్రచికిత్సకు ఎంత డబ్బు అవుతుందని చెబుతారో.. అంతే తీసుకునేలా ఆస్పత్రులతో మాట్లాడాం. ఇదంతా ఒక్కరోజులో జరిగిపోలేదు. ఇందుకోసం మేం హైదరాబాద్‌లోని దాదాపు ఆరొందల యాభై ఆసుపత్రుల్ని పరిశీలించాం. అక్కడ సదుపాయాలూ, శుభ్రతా, సేవలూ, చికిత్సానంతరం వారందించే సాంత్వన మార్గాలు.. ఇలా ఒకటి కాదు చాలా వివరాలు తెలుసుకున్నాం. అన్నివిధాలుగా సంతృప్తి చెందాక నూట ముప్ఫై ఆసుపత్రులను గుర్తించాం. వారితో మాట్లాడి రోగ నిర్ధరణ అనంతరం వాళ్ల దగ్గరకు రోగుల్ని పంపుతామంటూ భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. మమ్మల్ని ఎక్కువగా విజయవాడా, కాకినాడా, తణుకు, వైజాగ్‌, కర్నూలు, అనంతపురం, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ ల నుంచి సంప్రదిస్తుంటారు.
అంతా ఉచితమే..
మాకు ఫోన్‌ చేసి సమస్యలూ, ఆసుపత్రి వివరాలు చెప్పడమే కాదు.. ‘మీ ద్వారానే మాకు చికిత్స చేయించండి’ అని కొందరు అడుగుతుంటారు. అలాంటివారికీ సాయం చేస్తాం. మా నిపుణులు ఫోనులోనే వారి ఆరోగ్యం, అలవాట్లూ, ఏ సమస్యకు మందులు వాడుతున్నారు.. చేయించుకోవాలనుకుంటున్న చికిత్సా.. ఇలాంటివన్నీ తెలుసుకుంటారు. ఆ వివరాలను మా దగ్గరున్న ఆస్పత్రుల్లో ఒకదానికి అందజేస్తాం. వాళ్లతో మాట్లాడి చికిత్స తేదీనీ, సమయాన్నీ నిర్ణయిస్తాం. ఆ రోగులు ఆసుపత్రికి రావడానికి మందు ఎలా సిద్ధం కావాలీ, ఏ మందు వేసుకోవాలీ, ఏవి వేసుకోకూడదూ అనేది ఫోనులోనే సూచిస్తాం. వారు కేవలం ఆసుపత్రికి వెళ్లడానికి ముందు మా వద్దకు వచ్చి ఓ అడ్మిట్‌ కార్డు తీసుకెళితే చాలు. దాన్ని మేం సూచించిన ఆసుపత్రిలో చూపిస్తే వెంటనే గది కేటాయిస్తారు. చికిత్సలో ఎక్కడా ఆలస్యం జరగదు. వైద్యులు ఒకసారి వాళ్ల రిపోర్టులు చూసి నేరుగా శస్త్రచికిత్స చేస్తారు. వారు ఇంటికి వెళ్లే వరకూ ‘కేర్‌ మోటో’ వ్యక్తిగానే పరిగణిస్తారు. మేం అందించే ఫోను సమాచారం, చికిత్స ఏర్పాట్లూ అన్నీ ఉచితమే. గతేడాది మూడొందల యాభై మందికిపైగా మా సేవలు ఉపయోగించుకున్నారు. ఈ మధ్య కొందరు కౌన్సెలింగ్‌ చేయించమనీ, రిపోర్టులు నిపుణులకు చూపించాలనీ మమ్మల్ని ప్రత్యక్షంగా సంప్రదిస్తున్నారు. మా ప్యానల్‌లో ఉన్న డాక్టర్లతోపాటు.. మా స్నేహితుల్నీ పిలిపించి రోగులతో మాట్లాడిస్తున్నాం. వారాంతాల్లో కేర్‌మోటో క్లినిక్కుల ద్వారా ఈ సేవలు అందుబాటులోకి తెచ్చాం. భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకూ మా సేవలు విస్తరింపజేయాలన్నదే మా ఆలోచన. మా సేవలు కోరుకునే వారు మమ్మల్ని సంప్రదించాల్సిన నంబరు 040- 46465656.

Mirchi Today

Author & Editor

Has laoreet percipitur ad. Vide interesset in mei, no his legimus verterem. Et nostrum imperdiet appellantur usu, mnesarchum referrentur id vim.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...