Wednesday 26 April 2017

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయొద్దని తెలంగాణా జీవో కొట్టివేసిన హైకోర్ట్

HC cancels GO on Telangana State contract employees regularization

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయొద్దని తెలంగాణా జీవో కొట్టివేసిన  హైకోర్ట్ 

HC cancels GO on Telangana State contract employees regularization

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తామన్న ప్రభుత్వ హామీపై హైకోర్టు నీళ్లు చల్లింది. దీనికి సంబంధించిన జీవోను కొట్టవేసింది.

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 16 జీవోను కొట్టేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం బుధవారం తీర్పు ఇచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది.

కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీవో 16ను తీసుకొచ్చింది. అయితే దీనికి వ్యతిరేకిస్తూ ఉస్మానియా విద్యార్ధులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై విచారించిన న్యాయస్థానం బుధవారం తాజాగా ఆదేశాలను జారీ చేసింది. 1996 తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చిన కోర్టు.. ఈరోజు దీనికి సంబంధించిన జీవో 16 ను కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది.

                                                         

Mirchi Today

Author & Editor

Has laoreet percipitur ad. Vide interesset in mei, no his legimus verterem. Et nostrum imperdiet appellantur usu, mnesarchum referrentur id vim.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...