Saturday 29 April 2017

నీటి గురువు విద్యాసాగర్ రావు గారు ఇక లేరు

Telangana Govt Irrigation Advisor Vidyasagar Rao Passes Away

తెలంగాణ నీటి మాస్టారు ఇక లేరు. ప్రత్యేక ఉద్యమంలో జలపాఠాలు బోధించిన విద్యాసాగర్ రావు కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. విద్యాసాగర్ రావును క్యాన్సర్‌‌ రక్కసి వెంటాడింది. కీమోథెరపీ చేయించుకున్నా ఫలితం లేకుండా పోయింది.

తెలంగాణ నీటి పారుదల రంగానికి విద్యాసాగర్ రావు జీవగర్ర లాంటి వారు. ఉమ్మడిరాష్ట్రంలో తాగు,సాగునీటి రంగాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పోరాడిన వ్యక్తి. ప్రజలకు అర్ధమయ్యేలా నీళ్ల పంపిణీ అన్యాయాలను వివరించిన ఇంజనీర్. నల్లగొండ జిల్లా జాజిరెడ్డిగూడెంలో 1939 నవంబర్ 14న విద్యాసాగర్ రావు జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీలో పట్టా పొందారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. 1979లో యూనివర్సిటీ ఆఫ్ రూర్కీ నుంచి జలవనరుల విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. అమెరికాలో కొలరాడో యూనివర్సిటీ నుంచి వాటర్  రిసోర్సెస్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లమో కూడా చేశారు. నీటి వనరులు వాటి వినియోగంపై పూర్తి అవగాహన కలిగిన జలవనరుల నిపుణుడు విద్యాసాగర రావు. 1997లో చీఫ్ ఇంజినీర్‌గా కేంద్ర జలవనరుల శాఖలో పదవీవిరమణ చేశారు. కేంద్ర ప్రణాళికాసంఘం... 12వ పంచవర్ష ప్రణాళిక వర్కింగ్‌ గ్రూపులో సభ్యులుగా పనిచేశారు. నాబార్డు, ప్రపంచబ్యాంక్‌ సంబంధిత ప్రాజెక్టులకు... కేంద్ర ఇంటిగ్రేటెడ్‌ వాటర్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు సలహాదారుగా పనిచేశారు.

                                                                  

Mirchi Today

Author & Editor

Has laoreet percipitur ad. Vide interesset in mei, no his legimus verterem. Et nostrum imperdiet appellantur usu, mnesarchum referrentur id vim.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...