Sunday 4 June 2017

కేంద్రంలో నామినేటెడ్ పోస్టులను బేరమాడుతూ అడ్డంగా దొరికిపోయిన ప్రియా చౌదరి | స్టింగ్ ఆపరేషన్

Mirchi Today

కేంద్రంలో నామినేటెడ్ పోస్టులను బేరమాడుతూ అడ్డంగా దొరికిపోయిన ప్రియా చౌదరి | స్టింగ్ ఆపరేషన్

ABN Sting Operation On Nominated Posts | Priya Choudhary

కేంద్రంలో నామినేటెడ్ పోస్టులను బేరమాడుతూ ఏబిన్ ఛానల్ కి అడ్డంగా దొరికిపోయిన ప్రియా చౌదరి.మరింతసమాచారాన్నివీడియోలోతెలుసుకోండి.

Thursday 1 June 2017

ఐఏఎస్ సన్నాఫ్ ఆటో డ్రైవర్ | సాహో రూపేష్ | వరంగల్ వాసి

Mirchi Today

ఐఏఎస్ సన్నాఫ్ ఆటో డ్రైవర్ | సాహో రూపేష్ | వరంగల్ వాసి

పేదరికం సంకల్పానికి అడ్డుకాదని నిరూపించాడు రూపేష్.తన తండ్రి ఆటో డ్రైవర్గా పని చేస్తూ తన చదువుకు ఎంతో సహాయ పడ్డారు అని రూపేష్ తన తండ్రి గోప్పతనాన్ని కొనియాడాడు.పూర్తి ఇంటర్వ్యూ చూడండి మరింత సమాచారం కోసం.

Tuesday 2 May 2017

తెలంగాణ విద్యుత్ శాఖలో 13,357 ఉద్యోగాలు

Mirchi Today

తెలంగాణ విద్యుత్ శాఖలో 13,357 ఉద్యోగాలు


Telangana Electricity board 13357 jobs

తెలంగాణ విద్యుత్ శాఖలో భారీ ఎత్తున నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల పరిధిలో జూనియర్ లైన్‌మెన్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు మొత్తం 13,357 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో 1500 వరకు నాన్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో విద్యుత్ శాఖలోని దాదాపు పది వేల మందికి వెంటనే పదోన్నతులు కల్పించడానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Saturday 29 April 2017

నీటి గురువు విద్యాసాగర్ రావు గారు ఇక లేరు

Mirchi Today

తెలంగాణ నీటి మాస్టారు ఇక లేరు. ప్రత్యేక ఉద్యమంలో జలపాఠాలు బోధించిన విద్యాసాగర్ రావు కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. విద్యాసాగర్ రావును క్యాన్సర్‌‌ రక్కసి వెంటాడింది. కీమోథెరపీ చేయించుకున్నా ఫలితం లేకుండా పోయింది.

తెలంగాణ నీటి పారుదల రంగానికి విద్యాసాగర్ రావు జీవగర్ర లాంటి వారు. ఉమ్మడిరాష్ట్రంలో తాగు,సాగునీటి రంగాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పోరాడిన వ్యక్తి. ప్రజలకు అర్ధమయ్యేలా నీళ్ల పంపిణీ అన్యాయాలను వివరించిన ఇంజనీర్. నల్లగొండ జిల్లా జాజిరెడ్డిగూడెంలో 1939 నవంబర్ 14న విద్యాసాగర్ రావు జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీలో పట్టా పొందారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. 1979లో యూనివర్సిటీ ఆఫ్ రూర్కీ నుంచి జలవనరుల విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. అమెరికాలో కొలరాడో యూనివర్సిటీ నుంచి వాటర్  రిసోర్సెస్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లమో కూడా చేశారు. నీటి వనరులు వాటి వినియోగంపై పూర్తి అవగాహన కలిగిన జలవనరుల నిపుణుడు విద్యాసాగర రావు. 1997లో చీఫ్ ఇంజినీర్‌గా కేంద్ర జలవనరుల శాఖలో పదవీవిరమణ చేశారు. కేంద్ర ప్రణాళికాసంఘం... 12వ పంచవర్ష ప్రణాళిక వర్కింగ్‌ గ్రూపులో సభ్యులుగా పనిచేశారు. నాబార్డు, ప్రపంచబ్యాంక్‌ సంబంధిత ప్రాజెక్టులకు... కేంద్ర ఇంటిగ్రేటెడ్‌ వాటర్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు సలహాదారుగా పనిచేశారు.

                                                                  

Wednesday 26 April 2017

తెలంగాణా వద్దు ఉమ్మడి ఆoద్రప్రదేశ్ ముద్దు అంటున్న తెలంగాణా వెటర్నరీ విద్యార్ధులు

Mirchi Today

తెలంగాణా వద్దు ఉమ్మడి ఆoద్రప్రదేశ్ ముద్దు అంటున్న తెలంగాణా వెటర్నరీ విద్యార్ధులు
Telangana Veterinary Doctors Protest For Jobs In Telanagana

తెలంగాణా వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు కరవయ్యాయని తెలంగాణా పశువైద్య విద్యార్ధులు ధర్నాకు దిగారు ,మాకు తెలంగాణా వద్దు ఉమ్మడి ఆoద్రప్రదేశ్ ముద్దు అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు.

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయొద్దని తెలంగాణా జీవో కొట్టివేసిన హైకోర్ట్

Mirchi Today
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయొద్దని తెలంగాణా జీవో కొట్టివేసిన  హైకోర్ట్ 

HC cancels GO on Telangana State contract employees regularization

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తామన్న ప్రభుత్వ హామీపై హైకోర్టు నీళ్లు చల్లింది. దీనికి సంబంధించిన జీవోను కొట్టవేసింది.

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 16 జీవోను కొట్టేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం బుధవారం తీర్పు ఇచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది.

కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీవో 16ను తీసుకొచ్చింది. అయితే దీనికి వ్యతిరేకిస్తూ ఉస్మానియా విద్యార్ధులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై విచారించిన న్యాయస్థానం బుధవారం తాజాగా ఆదేశాలను జారీ చేసింది. 1996 తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చిన కోర్టు.. ఈరోజు దీనికి సంబంధించిన జీవో 16 ను కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది.

                                                         

Monday 17 April 2017

సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు సుప్రీం నిరాకరణ

Mirchi Today

సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు సుప్రీం నిరాకరణ


singareni dependent jobs cancelled by supreme court

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై హైకోర్టు తీర్పును న్యాయస్థానం సమర్ధించింది. వారసత్వ ఉద్యోగాలు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనను హైకోర్టు గతంలో రద్దుచేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను

ఆశ్రయించింది. 

                                            

Related Posts Plugin for WordPress, Blogger...