Friday 14 April 2017

ఓఎన్‌జీసీలో గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్

Mirchi Today

ఓఎన్‌జీసీలో గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్

Graduate trainee at ONGC
గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల కోసం ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్(ఓఎన్‌జీసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 27,2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ ఏజెన్సీ పేరు: ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్
పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ ట్రైనీ
ఉద్యోగ ప్రాంతం: ఇండియావ్యాప్తంగా
దరఖాస్తు ముగింపు తేదీ: ఏప్రిల్27.2017
మొత్తం పోస్టులు: 721
విద్యార్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో 60శాతం మార్కులతో ఎంసీఏ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.
పేస్కేల్: రూ.75000/-
వయో పరిమితి: జనవరి1,2017నాటికి గరిష్టంగా 63సంవత్సాల వయసు. 
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
దరఖాస్తు విధానం: ఏప్రిల్ 12,2017 నుంచి ఏప్రిల్27,2017మధ్యలో ఓఎన్‌జీసీ అధికారిక వెబ్ సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలి.
మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

Thursday 13 April 2017

గురుకుల విద్యాలయాల్లో 7306 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Mirchi Today

గురుకుల విద్యాలయాల్లో 7306  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

TSPSC Recruitment notification for 7306 posts

గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. 7వేల 306 పోస్టులకు TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. సవరించిన నిబంధనలతో నోటిఫికేషన్ జారీ చేసినట్లు అధికారులు ప్రకటించారు. పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్స్ 921, టీజీటీ 4 వేల 362, ఫిజికల్ డైరెక్టర్స్(స్కూల్స్) 6, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 616, ఆర్ట్ టీచర్స్ 372, క్రాఫ్ట్ టీచర్స్ 43, మ్యూజిక్ టీచర్స్ 197, లైబ్రేరియన్(స్కూల్స్) 256, స్టాఫ్ నర్స్ 533 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నెల 18 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు అధికారులు.

Wednesday 12 April 2017

ఇలా చేయకపోతే మీ బ్యాంకు ఎకౌంట్లు బ్లాక్ అవుతాయి

Mirchi Today

ఇలా చేయకపోతే మీ బ్యాంకు ఎకౌంట్లు బ్లాక్ అవుతాయి

central govt new bank rules

కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాదారులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30లోపు బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ వివరాలను అనుసంధానం చేయాలని ఖాతాదారులకు ఐటీ శాఖ సూచించింది. లేని పక్షంలో బ్యాంకు అకౌంట్ బ్లాక్ చేస్తామని కూడా హెచ్చరించింది. అంతేకాదు, జులై 2014 నుంచి ఆగస్ట్ 2015 లోపు బ్యాంకు ఖాతా తెరిచిన వారు ఆధార్ వివరాలతో పాటు కేవైసీ వివరాలను కూడా సదరు బ్యాంకుకు సమర్పించాలని సూచించింది. విదేశీ పన్నుల అమలు చట్టానికి లోబడి ఖాతాదారులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఐటీ శాఖ కోరింది. ఈ డెడ్‌లైన్‌కు లోబడి అందరూ వివరాలు సమర్పించాలని లేని పక్షంలో ఖాతాను బ్లాక్ చేస్తామని, ఆ తర్వాత ఖాతా నుంచి ఎటువంటి లావాదేవీలకు అవకాశం ఉండదని ఐటీ శాఖ తేల్చి చెప్పింది. సదరు బ్యాంకులు కూడా ఈ మేరకు ఖాతాదారులను అప్రమత్తం చేయాలని సూచించింది.

Thursday 6 April 2017

మూడు నెలల సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్‌ను వెనక్కి తీసుకోనున్న రిలయన్స్‌ జియో

Mirchi Today

మూడు నెలల సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్‌ను వెనక్కి తీసుకోనున్న రిలయన్స్‌ జియో
Jio summer surprise offer cancelled

రిలయన్స్ జియోకు ట్రాయ్ భారీ షాక్ ఇచ్చింది. 15 రోజుల పాటు పొడిగించిన జియో ప్రైమ్ ప్లాన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని గురువారం ఆదేశించింది. అలాగే మూడు నెలల సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్‌ను కూడా వెనక్కి తీసుకోవాలని రిలయన్స్‌ జియోకు సూచించింది.


దీనిపై స్పందించిన రిలయన్స్ జియో, ట్రాయ్ ఆదేశాలను తాము గౌరవిస్తామని పేర్కొంది. రూ.303కు రిఛార్జ్ చేసుకుంటే మూడు నెలలపాటు వర్తించే సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్‌పై సమీక్షించి వెనక్కి తీసుకుంటామని రిలయన్స్ జియో గురువారం ప్రకటించింది.

Tuesday 4 April 2017

శ్రీ రామనవమి విశిష్టత | శ్రీరామ నవమి రోజు చేయాల్సిన పనులు

Mirchi Today

శ్రీ రామనవమి విశిష్టత | శ్రీరామ నవమి రోజు చేయాల్సిన పనులు

srirama navami significance

శ్రీ రామ నవమి రోజున వడపప్పు, పానకం ఎందుకు నైవేద్యంగా పెడతారు దాని విశిష్టత ఏంటో తెలుసుకోండి.

Monday 3 April 2017

ఇండియన్ ఐడల్ రేవంత్ గురించి నమ్మలేని నిజాలు

Mirchi Today

ఇండియన్ ఐడల్ రేవంత్ గురించి నమ్మలేని నిజాలు

ఇండియన్ ఐడల్ గా ఎన్నికైన రేవంత్ గురించి నమ్మలేని నిజాలు.హోటల్ లో మొదలుకొని ఎన్నోకష్టాలు పడ్డాడు.మరెన్నోవిశేషాలు తెలుసుకోండి.
Related Posts Plugin for WordPress, Blogger...